ఈ నెల పొడుపు కథలు
- చెయ్యని కుండా, పొయ్యని నీరు, పెట్టని సున్నం, పెట్టని గిలక ఏమిటిది?
జ. కొబ్బరికాయ
- చింపిరి చింపిరి బట్టలు ముత్యాలు వంటి బిడ్డలు ఏమిటది?
జ.ముక్కజొన్న
- తోకలేని పిట్ట తొంబై ఆమడలు పోతుంది? ఉత్తరం కాదు, ఏమిటది?
జ. e-మెయిల్!
4.ముగ్గురు రాజులకు ఒక్కటే టోపి?
జ. తాటికాయ
- అందనంత దూరంలో నల్ల చీర. నిండా లెక్కలేనన్ని తెల్ల పూలు ఏమిటవి?
జ. ఆకాశం, చుక్కలు
- ఎండలో కనిపించేది వెంటే వచ్చేది ఏమిటది?
జ. నీడ
- అయ్యా అంటే కలవవు - అమ్మా అంటే కలుస్తాయి. ఏమిటవి?
జ. పెదవులు
- నాకు కన్ను ఉంటుంది కాని చూడలేను- నేనెవరు?
జ. సూది
- తెల్లని పొలంలో నల్లని విత్తనాలు, చేత్తో దున్నుతారు , నోటితో ఏరుతారు: ఏంటది?
జ. పుస్తకం