అదిగో అదిగో అందాలపట్నం
పట్నంలోన బాలవిహార్
బాలవిహార్లో రంగుల రాట్నం
రాట్నం చుట్టూ పట్టెల గుర్రాల్ 
గుర్రాలెక్కీ క్లక్ క్లక్ క్లక్
గుర్రాలెక్కీ గిరగిర గిరగిర
సవారి చేద్దాం చలో చలో!