ఆగష్టు 2008
Download
ఆగష్ట్ 2008 సంచికను download చేసుకోండి. PDF HTML in ZIP format (పాటలతో సహా) ...
పూర్తిగ>>స్వాగతం
కొత్తపల్లి ఆగస్టు సంచికకు స్వాగతం. మీకందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం అనగానే, ఎవరో చెప్పిన కథ గుర్తుకు వస్తున్నది ఒకటి: ఒక ముసలి…...
పూర్తిగ>>ఈ మాసపు జోకులు
సుధీర్ (సిద్ధిపేట) చెప్పిన జోకు: కొడుకు: అమ్మా.... అమ్మా.... పక్కింటి వాళ్లు లడ్డూలు ఎందుకు చేసుకుంటున్నారు? అమ్మ: వాళ్ల నాన్న చనిపోయాడట... అందుకు ...…...
పూర్తిగ>>ఆధునిక ధృవుడు (నాటిక)
ప్రభుత్వ బడులకు ఆదరణ కరువై, అక్కడ చదివే పిల్లలకు అవకాశాలు మృగ్యమైపోయిన ఈ రోజుల్లో, తమ బడికంటూ ఏకంగా ఒక పత్రికనే వెలువరించే ప్రభుత్వ బడి ఒకటుండగలదని, నిజంగా మేమెవ్వరం అనుకోలేదు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శాలిబండ వారు ’సృజన’ పేరిట వెలువరించిన వార్షిక పత్రిక మా కళ్ళు తెరిపించింది. ఇలాంటి ప్రభుత్వ పాఠ…
పూర్తిగ>>పిల్లల సేద్యం
’పిల్లలు సేద్యం చేస్తే..? అడవి పందుల్ని ఏం చేస్తారు?’ ఈ కథ చదవండి, తెలుస్తుంది. సుబ్బరాజు కలంలోంచి ఊడిపడ్డ ఈ కథ, సున్నితమైన హాస్యానికేకాదు, పల్లెజీవితపు పరమార్ధానికీ దర్పణం పడుతుంది. వాస్తవమేమో అని తోచే ఈ పెద్ద- అవాస్తవిక రచన, పూర్తిగా కొత్తపల్లి సొంతం- మీ కోసం.
పూర్తిగ>>మోసకారి గంగన్న
మోసాలు ఎక్కువ కాలం సాగవు. ఎంత తెలివైనవాడైనా, నీతి నిజాయితీలకు దూరమైతే దానికి ఫలితం తప్పక అనుభవిస్తాడు అని మోసకారి గంగన్న అనే జానపద కథ ద్వారా మోహనయ్య చెబుతున్నారు- చదవండి: రచన: మోహనయ్య, తెలుగు అయ్యవారు, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి.
పూర్తిగ>>అల్లరి దయ్యం
అల్లరి చేయటం అంటే ఇష్టం లేని పిల్లలు ఉండరు. వాళ్లంతా పెద్దవుతున్నకొద్దీ అల్లరి మానేస్తారు, కానీ ఆలోగా రకరకాల భయాలు పెంచుకుంటారు. దయ్యాలంటేను, రాక్షసులంటేను భయాలు మనసులో గూడు కట్టుకుంటాయి. అసలు దయ్యాలున్నాయో లేవో గాని ఇలా మనసులో నిలవ ఉండే దయ్యాలు మాత్రం పిల్లల్ని నిజంగా గందరగోళ పెడతాయి. ఇలా భయపెట్టే దయ్యాల్ని…
పూర్తిగ>>పెద్దదిక్కు
శ్రావణ భాద్రపదాలు అనే పేరుతో కోస్తాంధ్రలో వాడుకలో ఉండిన ఈ కథను గంగమ్మక్క రాయలసీమ రూపంలో గుర్తుచేస్తున్నది. గంగమ్మక్క టింబక్టుబడి, చెన్నేకొత్తపల్లిలో చిన్నపిల్లలకు చదువులు చెబుతున్నది. ఎన్నేళ్ళు గడిచినా ఆనందాన్నందించే ఈ కథను మీరూ చదవండి, మరోసారి నవ్వుకోండి.
పూర్తిగ>>గనగనగనగా..
పిల్లల కథల్లో అసంబద్ధత మధురంగా ఉంటుంది. మా చిన్నప్పుడెప్పుడో మేం విన్న ఈ అర్థంలేని కథ ఇంకా పిల్లల నోళ్ళలో నానుతూనే ఉంది.. ఎందుకంటారు? ఈలాంటి కథల్లోని ఏగుణం వీటిని పిల్లల మనసులకు దగ్గరచేస్తుంది? తమ బడి పత్రిక ’సృజన’ కోసం వంశి రాసిన ఈ కథ, పిల్లలకే సొంతమైన భావనలు వేటినో తెలియజేస్తుండాలి మరి. ఈ భావనల్…
పూర్తిగ>>అమ్మ చెప్పిన మాట
పెద్దలమాట, చద్దిమూట అని సామెత. పెద్దవాళ్ళు తమపై ఆంక్షలు ఎందుకు విధిస్తారో తెలీక, చిన్నపిల్లలు ఎప్పుడూ వాటిని అతిక్రమించి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటారు; తమ స్వతంత్రాన్ని తల్లిదండ్రులు హరిస్తున్నారని భావిస్తారు. అలాగే అనుకొని తల్లిమాటను నిర్లక్ష్యం చేసిన పిచ్చుక పిల్ల, చివరికి ఆ తల్లి ప్రేమభావనను అర్థంచేసుకోగలిగింది. …
పూర్తిగ>>బలవంతుని గర్వభంగం
నసీరుద్దీన్ కథల్లో ఒకటి, ఆరవ తరగతి నరేష్ రాసి ఇచ్చిన ఈ కథ. అయితే కథను ఒక్కొక్కరూ ఒక్కో రకంగా చెబుతుంటారు; అందరి కథలూ బానే ఉంటాయి. నరేష్ తన శైలిలో రంగరించిన ఈ కథ ఎలా ఉందో చదివి చెప్పండి. రచన: నరేష్, 6వ తరగతి
పూర్తిగ>>పిసినారి ఊరు
అక్బర్ బీర్బల్ కథల్లో ఒకటిగా ప్రాచుర్యంలో ఉన్న ఈ కథను నాగార్జున మార్చుకొని కొత్త కథగా తయారు చేశాడు. అతన్ని ప్రోత్సహించేందుకు ఈ కథ- ’పిసినారి ఊరు’. రచన: B.నాగార్జున, 8వ తరగతి, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, చెన్నేకొత్తపల్లి.
పూర్తిగ>>యువతరం శిరమెత్తితే
గానం: సతీష్ బృందం, 9వ తరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి సౌజన్యం: దేవి, ప్రజా నాట్య మండలి.
పూర్తిగ>>తేనెటీగా తేనెటీగా!
తేనెటీగని తేనెఇమ్మంటే ఇవ్వలేదు. వేరేవాళ్ళని అడగమంది. అందరినీ అడిగి అడిగి వేసారితే, చివరికి కాపు కూడా ఏమీ ఇవ్వను పొమ్మన్నాడు. జైసీతారాం కలం, గళం నుండి జాలువారిన మరో రత్నం ఈ గీతం. రచన: కీ.శే. ’కవికాకి’ జై సీతారాం గానం: సౌజన్య బృందం, 6వతరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి.
పూర్తిగ>>పిల్లలకే స్వాతంత్ర్యం వస్తే
’పిల్లలకే స్వాతంత్ర్యం వస్తే- ఏమౌతుంది?’ అదీ, ఈ పాట! ఈ గీతపు పూర్తి పాఠం ఇది కాదు అనిపిస్తుంది. ఇంకా చాలానే ఉండాలి. దీని ట్యూన్ లోకూడా హెచ్చు తగ్గులు తక్కువైనట్లున్నాయి, మార్చి పాడుకుంటే ఎలాఉంటుందో చూడండి, బాగుంటే మాకూ పంపండి. గానం: రోజా బృందం, ఎనిమిదవ తరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి.
పూర్తిగ>>నీలినీలి కొండమీద
వయోజన విద్య గురించి ఈ మధ్యకాలంలో ఎవ్వరూ మాట్లాడటంలేదు. ఒకప్పుడు, రాత్రి బళ్ళపైన నమ్మకం ఉండిన రోజుల్లో మన ప్రభుత్వం వారు, ఇతర రచయితలు కూడాను ఆ అంశంపై చాలా పాటలు రాశారు. భావాలు పాతవైపోయేసరికి ఆ పాటలూ చచ్చిపోయాయి. ఏవో కొన్ని పాటలు మాత్రం ఇలా పిల్లల నోళ్లలో పడి ఇంకా నానే భాగ్యానికి నోచుకున్నాయి. సాహిత్యదోషాలున్న…
పూర్తిగ>>పాడరా ఓ తెలుగువాడా!
తెలుగు సంస్కృతి గొప్పదనాన్ని, మన వారసత్వ సంపదను గుర్తుచేస్తూ రచించబడిన అనేక గీతాలలో ఇది ఒకటి. రచించిందెవరో తెలీలేదు. ఈ మధ్య అనిత దీన్ని మరీ మరీ గుర్తు చేసుకుంటున్నది. మీరూ ఆస్వాదించండి. దీని వివరాలు మీకేమైనా తెలిస్తే మా అందరితోటీ పంచుకోండి. గానం: అనిత, తొమ్మిదో తరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి.
పూర్తిగ>>కోయిలమ్మ
కోయిలమ్మలతో పిల్లలకు పోటీ పెడితే ఎలా ఉంటుంది? ఇలా ముగుస్తుందేమో అది! వినండి మరి! గానం: రాశి బృందం, మూడో తరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి
పూర్తిగ>>పిడుగులం!
’పిల్లలుకాదు బాబోయ్ పిడుగులు’ అని పెద్దలేకాదు, పిల్లలూ అనుకోవచ్చు. కవికాకి ప్రేమగా కూర్చిన పదాల్ని చిలకలా ఒప్పజెబుతున్నాడు గణేశ్.. చిత్తగించండి. రచన: కీ.శే. కవికాకి శ్రీజైసీతారాం. పాడిన (అప్పజెప్పిన) చిన్నారి: గణేశ్, రెండవ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి.
పూర్తిగ>>భరతుండేలినా
కొత్త కొత్త పాటలు.. ఎవరి రుచులు వారివి! ప్రకృతిబడిలో కొత్తగా చేరిన తిరుపాలు మెతకగా పాడిన ఈ పాటనే బహుశ: చాలా ఉషారుగా, పూర్తిగా వేరేగా పాడుకోవచ్చేమో మరి. దీనిలోని అక్షరదోషాల్ని మాకు తోచినంతవరకు సరిచేసాం., ఇంకా ఏమైనా కనబడితే క్షమించి, మార్చుకొని పాడుకోగలరు. గానం: తిరుపాలు. ఏడవతరగతి, ప్రకృతిబడి, చెన్…
పూర్తిగ>>ఆగస్టు పదిహేను
పాడిన చిన్నారి: శ్రీమంత్, రెండవతరగతి, ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల, ఆలియాబాదు, హైదరాబాదు.
పూర్తిగ>>అదిగదిగో ఆకసాన
రాజసంగా ఎగిరే మువ్వన్నెల జెండా మన జాతి గౌరవాన్ని ముజ్జగాలనిండా చాటుతుంటే, దాన్ని చూసిన కవి కలానికి వచ్చిన స్ఫూర్తి ఫలం ఈ పాట. దీని సాహిత్యంలోనూ దోషాలున్నై, కానీ అవి మావో, కవివో, సతీష్ వో తెలీక, కొద్ది మార్పులతో అలాగే వదిలేయవలసి వచ్చింది. వినండి: గానం, డప్పు: సతీష్, ఎనిమిదో తరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తప…
పూర్తిగ>>