కోయిలమ్మ గొంతెత్తి నువ్వు నువ్వు
తియ్యగా పాడుతావు కుహుఁ కుహుఁ
కుహుఁ కుహుఁ
వసంత కాలం వచ్చిందంటే నువ్వు నువ్వు
పసందుగా పాడుతావు కుహుఁ కుహుఁ
కుహుఁ కుహుఁ

చెట్టు చేమ చిగురేస్తే నువ్వు నువ్వు
చిగురు మేసి పాడుతావు కుహుఁ కుహుఁ
కుహుఁ కుహుఁ

ఇంతింత పాపలం మేము నువ్వు
తియ్యగా పాడుతాము కుహుఁ కుహుఁ
కుహుఁ కుహుఁ