పిల్లలకే స్వాతంత్ర్యం వస్తే
పిల్లలకే స్వరాజ్యం ఇస్తే
పిల్లలకే స్వాతంత్ర్యం వస్తే
పిల్లలకే స్వరాజ్యం ఇస్తే

చిట్టి తల్లినే రాణిని చేస్తాం
చిట్టి తండ్రినే రాజును చేస్తాం
చిట్టి తల్లినే రాణిని చేస్తాం
చిట్టి తండ్రినే రాజును చేస్తాం

మా అవ్వే ఒక బొమ్మైతేను
మాతాతే ఒక బొమ్మైతేను
బొమ్మలపెళ్ళికి రమ్మని అంటాం
కమ్మని విందులు గుమ్ముగతింటాం
||పిల్లలకే||

బడులలో గురువులు కరువైపోతే
పిల్లోళ్లమంతా పంతుళ్లమౌతాం
పెద్దలందరికి పాఠాల్చెపుతాం(2)

||పిల్లలకే||

సూర్యుడు ఎర్రని కాగితమైతే
గాలిపటంలా ఎగరేస్తాం
నక్షత్రాలే పుష్పాలైతే
మ్రొక్కుచు దేవుని మెడలో వేస్తాం

||పిల్లలకే||