సెప్టెంబర్ 2008

చుక్కల కోసం రెక్కలు

ఆకాశంలో నక్షత్రాల్ని చూస్తే ఏమనిపిస్తుంది? కోసుకో బుద్ధవ్వదూ? రాముకీ అలాగే అనిపించింది. మరి వాడు ఏం చేశాడో చూడండి మరి. రచన: నారాయణ

పూర్తిగ>>

ఎవరు గొప్ప

అర్థంలేని కథలు చెప్పి ప్రశ్నలు అడగటం మన జానపదులకే చెల్లింది. అస్సలు అర్థంలేని గొప్ప కథ ఒకటి ఉన్నది ఇక్కడ. అది చదివి ఎవరు గొప్పో తేల్చగల్గితే మీకు అక్షరలక్షలు లభించగలవు. ప్రయత్నించండి మరి. రచన: గంగమ్మ, టింబక్టు బడి, చెన్నేకొత్తపల్లి

పూర్తిగ>>

కుండ రాకుమారి కథ

ఇంగ్లీషువాళ్ళ "ఫెయిరీటేల్స్" తెలుగులోకి వచ్చేసరికి, ఇలాంటి జానపద కథలవుతాయేమో. వీటిలోని అవాస్తవికత, అసహజత్వమూ పెద్దలకు ఒకింత అసంతృప్తిని కలిగించే అవకాశం ఉంది. కానీ ఇంగ్లీషు కథలు చదవని చిన్నారులకు ఇవీ నచ్చుతాయేమో. మీరూ చూడండి. మీ అభిఫ్రాయాన్ని తెలపండి. ఈ కథని బషీర్, ప్రకృతిబడి మీకోసం తెలుగులో గుర్తు చేసుకుం…

పూర్తిగ>>

కుసుమాకుసుమా

చిన్న పిల్లలు కోరుకునే సున్నితత్వం ఈ నాలుగు పలుకుల్లో అందుతుంది. అందుకోండి. గానం: శిరీష బృందం, నాలుగో తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి.

పూర్తిగ>>

సంబరాలు సంబరాలు

కొత్తపంటలు వచ్చాక పాత పంటలు పోయాయి. కొర్రలు, సామలు, ఆరికెలు, రాగులు, జొన్నలు, సజ్జలు ఇంకా మరెన్నో తృణధాన్యాలు మన రాష్ట్రం నిండా పల్లె పల్లెల్లో సునాయాసంగా పండేవి. ఒకసారి మనమందరం బియ్యానికి అలవాటు పడిన తరువాత వీటన్నిటికీ ఆదరణ కరువైంది. ఇప్పుడు, పట్నపు కష్ట జీవితాల్లో చక్కెరవ్యాధులు, గుండెపోట్లు అధికమైన …

పూర్తిగ>>

సముద్ర తీరం

సముద్రతీరం పోవటం చాలా మంది పిల్లలకు వినూత్న అనుభవం. మనదేశానికి అంత పొడవు తీరరేఖ ఉన్నా, ఆ రేఖకు కడు దూరంగా ఉన్న ప్రాంతాల్లోని లక్షలాది మందికి తమ జీవితంలో ఒక్కసారికూడా సాగరుడిని చూసే అవకాశం ఉండదు. చెన్నేకొత్తపల్లి పిల్లల్లోకూడా, నిజానికి, నూటికి 99 మందికి ఈ భాగ్యం కలగలేదు- అయినా పాడుతున్నారు ముచ్చటగా- చిలుక…

పూర్తిగ>>

కాకమ్మ నలుపు

రచన: కీ.శే. కవికాకి జై సీతారాం గానం: రాశి, రియాజ్, మూడో తరగతి, ప్రకృతి బడి

పూర్తిగ>>

పిల్లి పిల్లి ఏమంటావ్

రచన: కీ.శే. కవికాకి జైసీతారాం ప్రచురణ: "మేం పిల్లలం" టింబక్టు కలెక్టివ్ గానం: జ్యోతి, శిరీష, నాలుగో తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.

పూర్తిగ>>

మాదే ఈ తరం

గానం: భారతి, శారద, తొమ్మిదో తరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.

పూర్తిగ>>

కనుక్కో కనుక్కో

తెలుగునాట పొడుపుకథలు చాలా ఉన్నై, రకరకాల రూపాల్లో. వీటిలో చదువుకునేవాటికంటే, పాటలుగా వినవచ్చినవి ఎక్కువకాలం నిలిచాయి కూడా. ఇక్కడ వినవస్తున్న పొడుపుకథ పాట ఒకటి, మీకోసం. గానం: చంద్ర, రెడ్డి, సయ్యద్ ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి.

పూర్తిగ>>

ఎంతో మంది పనివాళ్లు

మన గ్రామీణ సమాజం మనుగడ వృత్తిపనివారిపై ఆధారపడి ఉన్నది, ఈ నాటికీ. అయితే పట్నాల్లో పిల్లలకు మాత్రం అసలు వీరు ఎవరో కూడా తెలీటం లేదు ఈ కాలంలో. మారుతున్న సమాజపు విలువల్లో మనుషులు పోయి, యంత్రాలు చేరుకుంటున్నాయి. వృత్తిపనివారిని మనందరికీ గుర్తుచేసే ఈ పాటను వినండి, కొంచెం అలోచించండి. గానం: వరలక్ష్మి, మూడో తరగతి,…

పూర్తిగ>>

చెట్టుమీదినుండి కాకి

నిజంగా చదువురాని వారి బ్రతుకు అంత ఘోరంగా ఉంటుందో ఉండదో గాని మన సమాజం మాత్రం ప్రస్తుతం వారిని ఇలా ఛీకొట్టే దశలో ఉన్నదనటం మాత్రం వాస్తవం. ఈ పాట అంతం మాకు నచ్చలేదు- అయినా చర్చ జరిపే ఉద్దేశంతో, ఐదోతరగతిలో చేరిన కొత్తపిల్లవాడు రాజు పాడిన ఈ పాటను మీ ముందుకు తెస్తున్నాం. మీకేమనిపించిందో రాయండి. గానం: రాజు బృందం, ఐ…

పూర్తిగ>>

అద్దంలో ఎవరమ్మా

చిన్న చిన్న ఊహల్ని సున్నితంగా అడగటం బాల్యపు ప్రాధమిక లక్షణమేమో. కవికాకి జై సీతారాం చనిపోయేవరకూ చిన్నపిల్లవాడుగానే ఉన్నట్లు తోస్తుంది, ఈ రెండు లైన్ల పాటని వింటే. రచన: కీ.శే.కవికాకి జైసీతారాం గానం: రాశి, నాలుగో తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి.

పూర్తిగ>>

సామాజిక న్యాయం

అనంతపురంజిల్లా నసనకోటమండలంలోని అంబేద్కర్ బాలల సంఘపు చిన్నారి బి.రమేష్ ఒక చిన్న కథని గుర్తుచేసుకొని, మనందరితోటీ పంచుకునేందుకు ఇచ్చాడు. రమేష్ కథనాన్ని ప్రోత్సహించేందుకు ప్రచురిస్తున్న ఈ కథలో దాగున్న గతితార్కిక దృక్పధం మాకు ఆశ్చర్యం కలిగించింది. చిన్న చిన్న కథల్లో గహనమైన తాత్విక అంశాల్ని పరిచయం చేసిన రచయితలు ధన్…

పూర్తిగ>>

నిజమైన స్నేహం

నీతికథలనుండి నేర్చుకునే నీతి-నేతి బీరకాయలోంచి తాగే నెయ్యి ఒకటే అని మాకు నిజంగా అనుమానం . అయినా, పిల్లలు రకరకాలుగా ఉంటారు- ఎవరికి ఏ కథ నచ్చుతుందో ఎవరికి తెలుసు? ఎవరికి ఏది స్ఫూర్తినిస్తుందో ఎవరికెరుక? మీకు ఈ కథ నచ్చుతుందేమో?! ఎక్కడినుండో, ఎంత వయసో తెలీని వీరన్న రాసిన ఈ కథను ఈ ఉద్దేశంతో ప్రచురిస్తున్నాం. …

పూర్తిగ>>

కుడాలు

మొరటోని కథలు హాస్యానికి ఆలవాలాలు. ఇలాంటి కథలు మన జానపదాల్లో అనేకం లభిస్తాయి. ఇతర ప్రాంతాల్లో కుడుములు/పూర్ణాలుగా పిలుచుకునే ఒక రకం పిండి వంటల్ని అనంతపురం జిల్లాలో ’కుడాలు’ అంటారు. మీకోసం వండిన ఈ కుడాల కథను టింబక్టు బడిలో ఆరో తరగతి చదువుతున్న శివ రాశాడు. తిని ఆనందించండి.

పూర్తిగ>>

అవ్వ-కోయిల

పిల్లల సృజనకూ, వారిలోంచి ఊట మాదిరి స్రవించే మంచితనానికీ, ప్రతీకగా అనిపించింది మాకీ కథ. అవ్వ, కోయిల, కుందేలు, ఆవు అందరూ ఎందుకు కలసిమెలసి ఉన్నారో చూసి మీరూ కొంచెం ఆలోచిస్తారని, మీకోసం 4వ తరగతి రాజు రచించిన ఈ కథ.

పూర్తిగ>>

కీలుగుర్రం

జానపదకథల్ని విఠలాచార్యలాంటి దర్శకులు సినిమాలుగాతీస్తే ఒకప్పుడవి సంచలనాలయినాయి. ఆ తర్వాత వాటికి మళ్ళీ అంతటి ప్రేక్షకాదరణ లభించలేదు. కానీ అవి జనపదాల్లో సజీవంగా ఉంటూనే వచ్చాయి. "కీలుగుర్రం" కథలు మీరు అనేకం విని ఉంటారు. ఏడవ తరగతి, రేణుక కష్టపెట్టి, ఉత్సాహంగా అనేకమార్లు చెప్పిన ఈ అతిపెద్ద కథ, మీకూ పాత…

పూర్తిగ>>

కూరగాయల కథలు

పిల్లల కథల్లో కాయగూరల్ని జొప్పించి చెప్పే కథలు చాలా పేరుగాంచాయి. కొన్ని కొన్ని ప్రాంతీయ భేదాలతో ఈ కథలు దాదాపు ఒకే రకంగా వినిపిస్తుంటాయి. ఈసారి మాకు వీటి వెనకపడి వీలైనన్నింటిని సేకరించాలనిపించింది. అలా సేకరించిన వాటిలో మచ్చుకు ఓ మూడు కథలు- మీకోసం. మూడూ చదవండి, ’మీరు విన్నకథలకూ వీటికీ ఏమేం తేడాలున్నాయి, ఏవి బాగున్నాయి…

పూర్తిగ>>

సమస్యలు

సమస్యలు, పొడుపుకథలు మన మేధస్సుకు పదును పెడతాయి. పదవతరగతి పావని అడుగుతున్న ఈ సమస్యల్ని, గంగమ్మక్క అడుగుతున్న ఈ పొడుపుకథల్ని సొంతంగా సాధించగలరేమో ప్రయత్నించండి. వీలుకాకపోతే, మరేం చేస్తాం, జవాబుల్ని క్రిందే ఇచ్చాం, చూసి అర్థం చేసుకోగలరేమో ప్రయత్నించండి. రెండు రకాలుగానూ ప్రయత్నం మాత్రం అవసరమే మరి. విజయోస్…

పూర్తిగ>>

స్వాగతం

సెప్టెంబరు నెల వచ్చేసింది. హైదరాబాదులో వినాయక చవితి ఉత్సవాల్ని చూడాలి. ఉత్సవాలకు ఆర్నెల్ల ముందునుంచే వినాయక విగ్రహాలను అచ్చేసి, వాటికి రంగులేసే పిల్లల్ని చూడా…...

పూర్తిగ>>

Download

సెప్టెంబర్ 2008 సంచికను download చేసుకోండి. HTML in ZIP format (పాటలతో సహా) PDF PDF - పుస్తకంలా ముద్రించుకోవటానికి - 28 పేజీలు (రెండు …...

పూర్తిగ>>