సంబరాలు సంబరాలు ఎన్నీయల్లో, మరి పాతా పంటా  ఎన్నీయల్లో
సంబరాలు, సంబరాలు, సంబరాలు, సంబరాలు హో ! 
                                                            
పొద్దుగాలె పోతున్నాము ఎన్నీయలో, మరి సామ బువ్వ ఎన్నీయలో  
సంబరాలు, సంబరాలు, సంబరాలు, సంబరాలు హో !     	||సంబరాలు||
                                                       
పగటి భోజనం ఎన్నీయలో, మరి కొర్రాబువ్వా ఎన్నీయలో  
సంబరాలు, సంబరాలు, సంబరాలు, సంబరాలు హో ! 	||సంబరాలు||
                                              
రాత్రి భోజనం ఎన్నీయలో, మరి సజ్జ రొట్టే ఎన్నీయలో 
సంబరాలు, సంబరాలు, సంబరాలు, సంబరాలు హో ! 	||సంబరాలు||
                                              
పొద్దు గాలె పోతున్నాము ఎన్నీయలో, మరి రాగి ముద్దా ఎన్నీయలో 
సంబరాలు, సంబరాలు, సంబరాలు, సంబరాలు హో ! 	||సంబరాలు||