సముద్ర తీరం పోతిమి, చాల సేపు చూస్తిమి
సూర్యుడెంతో గుండ్రముగా చల్లని వెన్నెల కాయగా 
అలలు చక్కగ దొర్లుతూ, అవసరముగ పొర్లుచూ
నిలిచిఉన్న మాపైన,నీళ్ళు ఎత్తి  చల్లెను
కొత్త పావడా తడిసెను, ఎత్తి పట్టి నడిచాను
అంతలోన గవ్వలు, ఎంతో తెల్లగ వచ్చెను
జవర పట్ట బోతిమి, అన్నీ జారిపోయెను