అమ్మ మెతుకులు చల్లింది
కాకి ఒకటి చూసింది
కావూ కావని అరిచింది
కాకుల మూకను రమ్మంది
ఆకలితీరా కాకుల గుంపు అన్నం మెతుకులు తిన్నాయి

అమ్మ గింజలు చల్లింది
అన్ని కోళ్ళను రమ్మంది
వచ్చిన కోళ్ళు గింజలకోసం
ఒకదాన్నొకటి తరిమినవి
కాకుల ఒద్దిక కోళ్లకు లేదని లోకులకంతా తెలిసినది.