చిలకా చిలకా ఇదిగో గిలక
గిలకా వద్దు పలక ఇవ్వు
చిలకా చిలకా ఇదిగో పలక
పలకా వద్దు నులక ఇవ్వు
చిలకా చిలకా ఇదిగో నులక
నులకా వద్దు మొలక ఇవ్వు
చిలకా చిలకా ఇదిగో మొలక
మొలకా వద్ద పిలక ఇవ్వు
చిలకా చిలకా ఇదిగో పిలక
పిలకా వద్దు ఎలక ఇవ్వు
చిలకా చిలకా ఇదిగో ఎలక
ఎలకా వద్దు చిలక ఇవ్వు