బుడగలండి బుడగలు
భలే భలే బుడగలు

గాలిలోన తేలి ఆడు 
బంతి లాంటి బుడగలు

ఎగిరిపోవు బుడగలు
మెరిసిపోవు బుడగలు

ఉఫ్ మంటే టప్ మని
పేలిపోవు బుడగలు!!