చరిత లోని సారమిదే
గానం: శొంఠినేని సుప్రజ, సత్తెనపల్లి
చరితలోని సారమిదే, భవితలోని భావమిదే
వీరగాధ విజయగాధలెన్ని విన్న మూలమిదే
వందేమాతరం.. వందేమాతరం
వందేమాతరం అంటోంది మాతరం |చరితలోని|
అరవింద వివేకానంద రామక్రిష్ణ దయానంద
సమర్థుల సందేశం వందే మాతరం
ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ
రాణా రక్తపు శౌర్యం వందే మాతరం
ఝాన్సీరాణీ రుద్రమాంబ కత్తుల కథలే
వందే మాతరం వందే మాతరం
వందేమాతరం అంటోంది మాతరం |చరితలోని|
మనలోని అనైక్యత జాతీయ భావ హీనత
ఆసరగా అధికారం అందుకొనిరిరా
విద్వేషం రగిలించి విభజించి పాలించి
విద్రోహం తలపెట్టె ఫిరంగి మూకరా
బ్రిటిష్ విషపు తంత్రాలకు విరుగుడు మంత్రం
వందే మాతరం వందే మాతరం
వందే మాతరం అంటోంది మాతరం