చీమా! చీమా! వస్తావా? సినిమా కెళ్దాం వస్తావా? పరీక్షలయ్యా బాలయ్యా! బాగా చదువుకోవయ్యా! పిచుకా! పిచుకా! వస్తావా? పిక్చరు కెళ్దాం వస్తావా? పరీక్షలమ్మా పాపమ్మా! బాగా చదువుకోవమ్మా! చిలకా! చిలకా! వస్తావా? షికారు కెళ్దాం వస్తావా? పరీక్షలండ్రా బాలల్లూ! బాగా చదువుకోండర్రా!
