గువ్వా గువ్వా
గువ్వకు చిన్న గొంతు ఎందుకుంటుంది? ఈ పాట వినండి తెలుస్తుంది:
రచన: ’కవి కాకి’ కీ.శే.శ్రీ జై సీతారాం.
గానం: జి. పోతి రెడ్డి, (నాలుగవ తరగతి),జె. సౌజన్య,( ఐదవ తరగతి), పకృతిబడి, చెన్నేకొత్త పల్లి
డప్పు: పోతలయ్య, ఏడవ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్త పల్లి
గువ్వా! గువ్వా! నీ కేల, రెండు కాళ్ళు?
నేల మీద చక చకా నడవటానికి.
గువ్వా! గువ్వా! నీ కేల, రెండు రెక్కలు?
గగనంలో రెప రెపా ఎగరడానికి.
గువ్వా! గువ్వా! నీ కేల, గట్టి ముక్కు?
గింజ గిట్రా టక టకా పొడవటానికి.
గువ్వా! గువ్వా! నీ కేల, చిన్న గొంతు?
పాటలన్నీ కిల కిలా పాడడానికి.