కోడి పిల్లలు అమ్మ చుట్టూ
ఆడుకుంటూ ఉన్నాయి

నల్ల పిల్లి గోడ వెనుక
నక్కీ నక్కీ పొంచుంది

నింగి నుండీ పెద్ద గద్ద
నేల మీదకు చూసింది

పిల్లి చెంగున దూకింది
గద్ద రివ్వున వాలింది

ఒక్కేసారి పిల్లీ గద్దా
డిక్కీ డీక్కీ ఢీ కొన్నాయి

పిల్లికి కన్ను పోయింది
గద్దకు రెక్క విరిగింది

కివ్ కివ్ గద్ద
మ్యావ్ మ్యావ్ పిల్లి

నవ్వీ నవ్వీ కోడి పిల్లలు
నాట్యమాడుతున్నాయి.