కోడి పిల్ల కోడి పిల్ల 
ముద్దుగుంటది

ముట్టుకుంటె పట్టుకుంటె
మెత్తగుంటది

గింజలేసి పెంచితే
పెద్దదౌతది

పెద్దదై పెద్దదై
గుడ్డు పెడతది

గుడ్డు తింటె బాలలకు
బలం వస్తది

తల్లి పొట్టకింద పొదిగితె
పిల్లౌతది!