నవ్వులం పువ్వులం

ఎగిరేటి గువ్వలం

నీలాల నింగిలో తారలం

మేము నీలాల నింగిలో తారలం

పేరుకే మేము బాలలం

పెద్ద పెద్ద మనుషులకే నేస్తులం

శాంతికి మేము నేస్తులం

భావితరాల పునాదులం "నవ్వులం"

రంగు రంగు కలలుగన్న రాజులం

వేల వేల ఆశలున్న రాణులం

కలలన్నీ నిజమయ్యేలా పెరుగుతాం

ఆశలన్నీ ఆచరణలో చూపుతాం "నవ్వులం"

అమ్మా నాన్నా పెంచుకున్న కోర్కెలం

ప్రతి ఇంటింటా వెలుగులను నింపుతాం

ప్రతిభా ప్రభావాలను చూపుతాం

ప్రతి ఇంటింటా వెలుగులను నింపుతాం "నవ్వులం"