పూసినపూలు ఏమన్నాయి?

విచ్చినపూలు ఏమన్నాయి?

పిల్లల్లారా రమ్మన్నాయి!

లచ్చిక దండలు గుచ్చన్నాయి!

రోజాపూలు ఏమన్నాయి?

జాజిపూలు ఏమన్నాయి?

రాజూ రాణికి ఇమ్మన్నాయి!

మోజుగ వాసన చూడన్నాయి!

బంతిపూలు ఏమన్నాయి?

చామంతిపూలు ఏమన్నాయి?

బంతులాట ఆడన్నాయి!

పూబంతులాట ఆడన్నాయి!