అమ్మ మొదటి దైవము
ఆవు పాలు మధురము
ఇటుకగోడ అందము
ఈల పాట విందుము
ఉడుత తోక అందము
ఊయలూగుచుందుము
ఎలుక వల్ల నష్టము
ఏనుగెక్కుటిష్టము
ఐస్ క్రీం చల్లన
ఒంటె నడక మెల్లన
ఓడ నీట తేలును
ఔటు బలే పేలును!