శిరసెత్తు గగనంబుదాక
సేకరణ, స్వరకల్పన: కె.గంగమ్మ, ఉపాధ్యాయురాలు, టింబక్టుబడి.
గానం: భవ్య, ఎ.ఎస్.గీతిక, టి.నాగమణి, కె.భార్గవి, పి.విశ్వనాథ్, లిఖిత, సి.కృష్ణవేణి, టి.ఓమలత, ఆరవ తరగతి, టింబక్టుబడి.
డప్పు: పి.పోతులయ్య, ఎనిమిదవ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి.
శిరసెత్తుగగనంబుదాక
చిరయశము దశదిశలు ప్రాక
ఓ భారత పతాక
శాంతి సౌభాగ్యరేఖ
శిరసెత్తుగగనంబుదాక
చిరయశము దశదిశలు ప్రాక
ఎపుడు లాల్ ఖిల్లాపై ఎగిరేవు నీవు
అపుడే తెల్లదొరతనము దాటినది రేవు
ఎపుడు స్వేచ్ఛాశంఖం ఊదితివో నీవు
అపుడే బానిసతనము బడచినది చావు
ఓ భారత పతాక శాంతి సౌభాగ్యరేఖ
శిరసెత్తుగగనంబుదాక
శిరయసము దశదిశలు ప్రాక
నువు నడుచు దారులలో అడ్డుకనరాక
నీకెవరు లోకమున శత్రువులు లేక
ఈగాలి ఈ నీరు సోకునందాక
ఏభయము లేక ప్రజ జీవించునుగాక
శిరసెత్తుగగనంబుదాక
చిరయశము దశదిశలు ప్రాక
ఓ భారత పతాక శాంతి సౌభాగ్యరేఖ
శాంతి సౌభాగ్యరేఖ శాంతి సౌభాగ్యరేఖ