స్వాగతమండీ
రచన మరియు స్వరకల్పన: కె. గంగమ్మ, ఉపాధ్యాయురాలు, టింబక్టు బడి, అనంతపురం జిల్లా.
గానం: ప్రవీణ, ఎ.ఎస్.నందన, డి.రజని, చెన్నకేశవ రెడ్డి, మల్లికార్జున(మూడవ తరగతి), పి.హర్షవర్ధన్ రెడ్డి (రెండవ తరగతి), టింబక్టుబడి.
డప్పు: పి.పోతులయ్య, ఎనిమిదవ తరగతి, ప్రకృతిబడి.
స్వాగతమండీ స్వాగతం
చిన్నిపిల్లల స్వాగతం
మృదువుగ ఇచ్చే స్వాగతం
ముద్దులుఒలికే స్వాగతం ।స్వాగతమండీ ।
చిన్ని పిల్లలమొచ్చినాము
ఆటలు బాగా ఆడెదము
పాటలు కూడా పాడెదము
ఆటలు పాటలతో మేము
ఆనందముగా ఉండెదము ।స్వాగతమండీ ।
చాచా నెహ్రూ మా నేస్తం
ఎర్ర గులాబి మాకిష్టం
శాంతి కపోతం ఆదర్శం
హరివిల్లే మా ఆనందం ।స్వాగతమండీ ।