మా ఊరు

ఊరు ఊరు మా ఊరు
ఊరు ముందర మా తోట
తోటలోన జామచెట్టు
చెట్టు మీద చిలకమ్మ
చిలకమ్మ పేరు సీతమ్మ
సీతమ్మ జడలో చేమంతి

వానదేవుడు

వానదేవుడొచ్చినాడు వాసుదేవ
చెరువులన్ని నిండినాయి చెన్నకేశవ
మడులన్ని దున్నినారు మల్లికార్జున
ఎరువంతా వేసినారు ఎర్రిసామి
కరువులన్ని పోయినాయి కాశినాథ
కేరింతలు కొట్టినారు బాలలంతా

పిచ్చిపాట

అప్పా అప్పా ఓబులప్పా
ఉప్పు ఉప్పు ఈయప్పా
ఇవ్వకపోతే చూడప్పా
కొడతా కొడతా నరసప్ప

దుబ్బోడు

దుబ్బోడమ్మా దుబ్బోడు
దుబ్బ బిస్కెట్ తిన్నాడు
ఇంకా కావాలన్నాడు
అమ్మకు కోపం వచ్చింది
మూడు గుద్దులు గుద్దింది