ఒక రోజు ఐస్‌క్రీం పోతూ ఉంది.

<IMG SRC="http://kottapalli.in/static/images/2010/09/ice1.jpg", width=250, height=300, alt="ICE1.JPG">

<IMG SRC="http://kottapalli.in/static/images/2010/09/ice2.jpg", width=250, height=300, alt="ICE2.JPG">

పెద్ద గాలి వచ్చింది.

కొంచెం ఐస్‌క్రీం ఎగిరిపోయింది.

మళ్ళీ పోతా పోతా ఉంటే వానొచ్చింది.

<IMG SRC="http://kottapalli.in/static/images/2010/09/ice3.jpg", width=250, height=300, alt="ICE3.JPG">

గొడుగు తీసేలోపల కొంచెం ఐస్‌క్రీం బురదలో పడిపోయింది.

వాన తగ్గింది. ఐస్‌క్రీం గొడుగు ముడిచింది.

ఇంతలో ఎండ వచ్చింది!

వేడికి ఐస్‌క్రీం అంతా కరిగిపోయింది!

అయితేనేమి..?..

<IMG SRC="http://kottapalli.in/static/images/2010/09/ice4.jpg", width=250, height=300, alt="ICE4.JPG">

ఐస్‌క్రీం నేరుగా అలా అలా ఆవిరై, చందమామ దగ్గరికి వెళ్లింది.

అందుకే చందమామ- చల్..ల్.......ల్లగా ఉంటాడు!