**1.ధన వంతుల అబ్బాయికి ట్యూషన్ చెప్పే మాస్టారు తలపట్టుకునేదెప్పుడు!? **

వాడికి ఎన్నిసార్లు 'ఎ,బి,సి,డి....' లు నేర్పినా 'ఎ,సి' మాత్రమే రాస్తున్నప్పుడు !!

**2. దంతవైద్యుడు చాక్లెట్ ఫాక్టరీ పెడితే ....!? **

"చాక్లెట్ తినటం పళ్ళకు హానికరం "అని ప్రతి చాక్లెట్ మీదా ప్రింట్ చేస్తాడు!!

**3. మౌనవ్రతం ఎక్కడ విజయవంతం అవుతుంది!? **

లైబ్రరీలో

**4. డబ్బింగ్ ఆర్టిస్ట్ తల్లి అయి ఏం చేస్తుంది!? **

రికార్డు చేసిన జోలపాటకు పెదిమలు కదిలిస్తూ పిల్లాణ్ణి నిద్రపుచ్చుతుంది.

**5. తండ్రి తల పట్టుకునేదెప్పుడు!? **

"లెక్కల్లో సున్నా వచ్చిందేంట్రా " అని కొడుకును అడిగితే "సున్నాని కనిపెట్టింది మన భారతీయులే నాన్నా" అని కొడుకు గర్వంగా చెప్పినప్పుడు!

**6. ఆర్.టి.సి కి లాభాలు తెప్పించమంటే తెలివైన కండక్టరు ఏం చేశాడు!? **

లావుగా వున్న ప్రయాణీకుల్ని ఒకటిన్నర టికెట్ తీసుకోమన్నాడు!

**7. విమాన ప్రయాణాల్లో విడ్డూరం ఏంటి!? **

విమానాల్లో తీసుకెళ్ళే లగేజికి లిమిట్ ఉంటుంది; కానీ ప్రయాణీకుల బరువుకి మాత్రం ఏలాంటి పరిమితీ ఉండదు!

**8. మేనేజర్ అయోమయంలో పడేదెప్పుడు!? **

"నాకు చెడ్డపేరు తెచ్చుకునయినా సరే మీకు మాత్రం మంచి పేరు తెస్తాను సార్" అని అసిస్టెంట్ మేనేజర్ అన్నప్పుడు!