**1. ఫైర్ఆఫీసర్ 'ఫైర్' అయ్యేదెప్పుడు!? **
కడుపు 'మంట'గా వుందని ఓ వ్యక్తి ఫోన్ చేసినప్పుడు!!
**2. మిమిక్రీ ఆర్టిస్ట్ ఇంట్లోకి దొంగ ప్రవేశిస్తే....!? **
కుక్కలా అరుస్తాడు!!
**3. దేవుళ్ళు కొండలమీదే వెలుస్తారెందుకు!? **
స్వచ్ఛమైన ఆక్సిజన్ కోసం!!
**4. "సౌండ్"స్లీప్ అంటే......!? **
గురకనిద్ర!!
**5. మంత్రిగారు ముగ్ధుడయ్యేదెప్పుడు!? **
మనవడికి కథచెప్తుంటే వాడు "ఊ" కొట్టకుండా "జై" కొడుతున్నప్పుడు!!
**6. వెటర్నరీ డాక్టరు ఇంటిగేటు మీదున్న బోర్డు మీద ఏమనిరాసి వుంది!? **
"రేబిస్ వ్యాధి కలిగించే కుక్క వున్నది జాగ్రత్త"
**7. "పూలమ్మిన చోట కట్టెలమ్మటం" సామెత పాతదైపోయింది. మరి కొత్త సామెత ఏంటి? " **
చెరకు పండించిన పొలంలో వంట చెరకు పండించటం!!"
**8. అద్భుతమైన ఆఫర్!? **
"తాళంకప్ప కొంటే తాళంచెవి ఉచితం!!
**9. కోపంగా ఉన్న ఇల్లాలు ఏంచేస్తుంది?! **
పుట్టింటి వాళ్ళొచ్చినప్పుడు టి.వి, అత్తింటి వాళ్ళు వచ్చినప్పుడు రేడియో పెడుతుంది!!
10. చిట్టిపిల్లల తల్లిదండ్రులకు ముందుచూపుతో మీరిచ్చే సందేశం?
వాళ్ళు బడికి వెళ్ళే ముందు హాపీ,
వెళ్ళటం మొదలు పెట్టిన తర్వాత బిపి!!
