**ఏదో ఛానల్! **

టీచర్ : శ్రీకాంత్   'ఇంగ్లీష్  ఛానల్ ' ఎక్కడుంది?
శ్రీకాంత్ : ఏమో! టీచర్ ! మాటివీలో  ఆ ఛానల్    రాదు . 

చెప్పుడు మాట

టీచర్: రాము! దొంగతనం  చేయటం  తప్పని  నీ  అంతరాత్మ చెప్ప  లేదా?!
రాము: చెప్పింది టీచర్, కానీ  చెప్పుడు మాటలు  వినరాదని  మీరే అన్నారు  కదా, అని....

ఇంపాజిబుల్ ఈజ్ పాజిబుల్!

సుబ్బు: మామ్!  నేను ఇవ్వాళ్ల   'ఇంపాజిబుల్ ' ను  'పాజిబుల్ '  ఎలా  చేయాలో  తెలుసుకున్నా.
తల్లి: ఎలా?
సుబ్బు : 'ఇంపాజిబుల్ ' లో  మొదటి  రెండు  లెటర్లు  తీస్తే  సరి.

నిజంగా వెంగళప్పే!

వెంగ ళప్ప కొడుకు : మా నాన్న  చాలా ధైర్యవంతుడు . పులి  బోనులోకి  వెళ్ళాడు ...
రాము : అబ్బ! అవునా!? బయటికి వచ్చాక  అందరూ  భలే  మెచ్చుకుని   ఉంటారు!
వెంగళప్ప కొడుకు: బయటకు  వచ్చాడని  నేను చెప్పలేదు.

అతి జాగ్రత్త!

చింటూ: ఎక్స్ ప్సెస్  ఎప్పుడొస్తుందండి?
T.C: రెండింటికి. 
చింటూ : ప్యాసింజర్ ?
T.C: మూడింటికి.
చింటూ : మరి గూడ్స్? 
T.C: ఇంతకీ  నువ్వు ఎటు వెళ్లాలి?
చింటూ: రైలు పట్టాల  అవతలకి !!



కొత్త రామాయణం!

టీచర్: సీతా,   లక్ష్మణుడు  వాళ్ల  అన్న పేరు ఏంటో చెప్పమ్మా ?
శ్వేత: ఆగండి టీచర్!  అక్ష్మణుడిని  అడిగివస్తాను ప్లీజ్!

జోడు కష్టాలు!

రాము: ఒరేయ్ నీకు  ఒక  చెవి కోసేస్తే   ఏం  జరుగుతుంది?
రాజు:వినబడదు.
రాము:మరి రెండు చెవులుకోసేస్తే?!
రాజు:కనబడదు
రాము:అదెలా?!?
రాజు:రెండు చెవులూ  కోసేశాక  ఇక  నా కళ్ల జోడు నిలబడదుకదా?!