పదరంగం-7 ఈ పదరంగం చాలా సులభం! దీన్ని పూరించి పంపండి. మీ పేరుతో బాటు మీ బడి పేరు, తరగతి తప్పక రాయండి. సరైన సమాధానాలు పంపిన పిల్లల పేర్లను పదరంగం-8 తో పాటు ప్రచురించగలం. నిర్వహణ: దేవి, కొత్తపల్లి బృందం.

ఆధారాలు:

అడ్డం:

1. సమాధానం(3)
3. రమ్మని రెండు సార్లు పిలు! (2)
5. రచనలు చేసేవాడు (4)
7. దగ్గర (2)
9. రాక్షసుడి చెల్లి (3)
11. ఇనుప వస్తువులను ఆకర్షించేది(4) 
12. రోజు (2)

నిలువు:

1. రక్తం పీల్చుకునే పురుగు (3)
2. వానా కాలంలో కాళ్లకి అంటుకునేది(3)
3. రాళ్ళు- ఏకవచనం (2)
4. 'వ్రాత'ని ఇలా రాస్తారు (2)
6. గజిబిజిగా 'రామచరితం'(5)
8. ప్రయాణం (3)
10. చలన చిత్రం (2)
11. ఇది కాదు (2)

పదరంగం-6 కి సరైన సమాధానం

దీనికి చక్కగా సమాధానాలు వ్రాసి పంపించిన పిల్లలు:

  1. నందన ఏ.యస్, 4వ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి.
  2. అసంగానంద రెడ్డి, 4వ తరగతి, అజంతా స్కూల్, నెల్లూరు.
  3. జి.సత్యలక్ష్మి, 2వ తరగతి, ఇంటి బడి, చెన్నేకొత్తపల్లి.