రచన: వి.వి.యస్ .మూర్తి,చొదిమెళ్ళ.
1.కరెన్సీ నోటులో తెల్లని భాగం దేనికి!?
జవాబు: రఫ్ వర్కు చేసుకోటానికి.
2.'అర్ధరాత్రి ' కి వ్యతిరేక పదం చెప్పమన్న తెలుగు మాస్టారు తలపట్టుకునేదెప్పుడు!?
జవాబు: 'అర్ధపగలు ' అని విద్యార్ధి అన్నప్పుడు.
3.అమ్మ అదిరిపడేదెప్పుడు!?
జవాబు: ఒకటోతరగతి చదివే కొడుకు "హోంవర్క్ చెయ్యటానికి నెట్ సెర్చ్ చేస్తున్నాను" అన్నప్పుడు.
4.పిల్లలు దేవుడితో సమానం, మరి వృద్ధులు.....!?
జవాబు: ఆస్తి వుంటే దేవుళ్ళు - లేకపోతే దెయ్యాలు.
5.పురాణ కాలంలో ప్రపంచ బ్యాంకుని ఏమని పిలిచేవారు?
జవాబు: కుబేరుడు.
6. కలికాలం అంటే?
జవాబు: 'అన్నమో రామచంద్రా' అన్న తోటి వాడికి అన్నం పెట్టకుండా ఆకలనే అడగని రామచంద్రుడికి నైవేద్యం పెట్టటం.
7.జాతకం చూపించుకోటానికి ఎవరి దగ్గరకెళితే మంచిది?
జవాబు: జాతకం చూసేవాళ్ళలో ఎవరి జాతకం బాగుందో తెలుసుకుని, అతని దగ్గరకెళ్తే మంచిది.