కుందేలు తాబేలు పందెమేసుకున్నాయి

చెరువునుండి కొండదంక పరుగెత్తే పందెము

కుందేలు చెంగు చెంగున ముందు ముందుకు పోయింది

దారిలోన చల్లనైన చెట్టు నీడను చేరింది

కాసేపు నిద్రిస్తానని గాఢ నిద్ర పోయింది

నిముషం కూడా తాబేలు నిలబడకుండా నడిచింది

చాల సేపుకు కుందేలు మేలుకొని చూసింది

ఇంకేముంది ఇంకేముంది తాబేలే గెలిచింది!