**1.సినిమాల్లో నటించే కుక్క యజమానిని ఇంటర్వ్యూ చేస్తే ఏమన్నాడు? **
"మా కుక్కని వెటర్నరీ డాక్టరు చెయ్యాలనుకున్నాం కాని అది యాక్టరయింది" అన్నాడు!!

**2.వృద్ధ మహిళా పేషెంట్ ఎందుకు మురిసిపోయింది!? **
"సాధారణంగా ఇలాంటి జబ్బు యువతులకు మాత్రమే వస్తుంది" అని వైద్యుడు అన్నాడుగా!

**3."బంగారం ఎందుకు దొంగిలించావ్" అని జడ్జి అడిగితే దొంగ ఏమన్నాడు?! **
"అక్షయతృతీయ సందర్భంగా" అన్నాడు!!

**4. డ్రయివర్‌కి చిరాకు ఎందుకొచ్చింది?! **
లేడీ కండక్టర్ పదే పదే సైడ్ మిర్రర్లో బొట్టు సవరించుకుంటోందని!

**5."ఫీజు ఎక్కువ" అన్న పేరెంట్‌తో ప్రిన్సిపాల్ ఏమన్నాడు?! **
"ఏం పర్వాలేదండీ! మీ ఇష్టం! నేటి రూపాయిలే రేపటి డాలర్లు అని మాత్రం మర్చిపోకండి!” అన్నాడు.

**6."న్యాయంలో అన్యాయం" అంటే!? **
జవాబు: దొంగ సర్టిఫికెట్‌తో న్యాయ వాది అవ్వటం!!

**7. 'అత్యాశ' అంటే.....? **
జవాబు: టికెట్ కొనకుండా లాటరీ రావాలనుకోవటం!