నిర్వహణ : శ్రీ వివియస్ మూర్తి, చొదిమెళ్ళ.
1.పేరెంట్ అయోమయంలో పడేదెప్పుడు!?
జవాబు: "మీ వాణ్ణి 'ఐ.ఐ.టి L.k.Gలో' చేరుస్తారా 'ఆర్డినరీ L.k.Gలో' చేరుస్తారా?” అని హెడ్ మాస్టారన్నప్పుడు.
2.ఆశ్చర్యం కలిగించే విషయం!?
జవాబు: గూడ్స్ డ్రయివర్ ఫాస్ట్ ఫుడ్ తినటం!!
౩. సైన్సుమాస్టారు భార్యని ఎలా పొగుడుతాడు!?
జవాబు: "ఇంటికి సోలార్ దీపం ఇల్లాలు"
4.గడియారాలు రిపేర్ చేసేషాపు ముందు బోర్డు!?
జవాబు: మీటైం బాగోపోతే మమ్మల్ని సంప్రతించండి!!
5.ఫారెస్ట్ ఆఫీసర్ అయోమయంలో పడేదెప్పుడు!?
జవాబు: కొత్త అల్లుడు 'పిట్టమాంసం' కోరినప్పుడు!
6.జలుబు చేసిన పిల్లాణ్ణి డాక్టరు దగ్గరకు తీసుకెళ్లిన తల్లి, అయోమయంలో పడేదెప్పుడు!?
జవాబు: "బాబుని ఐస్‌క్రీం, కూల్‌డ్రింక్ యాడ్‌లు చూడనివ్వకండి" అని డాక్టరు అన్నప్పుడు!!
7."మేడ్ ఫర్ ఈచ్ అదర్ " అంటే.....!?
పెళ్ళికూతురు డాక్టరు, పెళ్ళికొడుకు మందులషాపు ఓనరు!!