** చిట్టి చిలకమ్మ**

చిట్టిచిలకమ్మ
అమ్మకొట్టిందా
తోటకెళ్ళావా?
పండు తెచ్చావా?
గూట్లో పెట్టావా?
గుటుక్కు మింగావా!

** చుక్ చుక్ రైలు **

చుక్ చుక్ రైలు వస్తోంది
దూరం దూరం జరగండి
ఆగినంక ఎక్కండి
జోజో పాపా ఏడవకు
లడ్డు మిఠాయి తినిపిస్తా
చల్లని పాలు తాపిస్తా
చక్కని సినిమా చూపిస్తా.

**ఊష్ కాకి **

ఊష్ కాకి!
మా చేనులో వాలద్దు
మా కంకి కొరకద్దు.
మా చేనులో వాలద్దు
మా నాన్న పేదోడు
మా అమ్మ రాకాసి
నేనేమో గ్లూకోసు!

** దుబ్బోడి పాట **

దుబ్బోడమ్మా దుబ్బోడు
దుబ్బ బిస్కెటు తిన్నాడు
ఇంకా కావాలన్నాడు
అమ్మకు కోపం వచ్చింది
మూడు గుద్దులు గుద్దింది


** శాంతక్క పాట **

శాంతక్కా , బావేడి?
బజారుకు వెళ్ళాడు
ఏమి తెచ్చాడు?
పప్పులు తెచ్చాడు
పొప్పులు ఏవీ?
గుడ్డోడు తిన్నాడు
ఎట్లా తిన్నాడు?
కాల్చుకొని తిన్నాడు
ఏమి కాలింది?
మీసం కాలింది.