రంజాన్ మాసం.. రంజాన్ మాసం
రంజాన్ మాసం.. రంజాన్ మాసం

పవిత్రమైన మనుగడ- నిర్దేశించు నిరుపమాన
ఖురాన్-అల్లా లోకానికి అందించిన మాసం
"రంజాన్ మాసం"

రాగద్వేషాలు మరచి రా భాయీ అంటూ
సోదరులుగ ఒకరినొకరు ఆదరించుకొను మాసం "రంజాన్ మాసం"

చెడు చేయు తలపులు చేరనీక మనసున
రుజువర్తనులైజనులు సమాజాన మసలు మాసం
"రంజాన్ మాసం"

పగటి పూట ఉపవాసం రాత్రి సాత్వికాహారం
నిత్యం మసీద్ దర్శనం పవిత్ర ఖురాన్ పఠనం
ప్రతి ముసల్మాన్ మనసున అల్లా వసియించు మాసం
"రంజాన్ మాసం"

ఆకసాన చంద్రరేఖ అగుపించిన మరుదినం
జనులంతా ఉత్సాహంగా జరుపుకొందురు రంజాన్ పండుగ
"రంజాన్ మాసం"