**1. ఇంకేమీ చేయకుండా కట్టిపడేసే 'దనం' ఏంటి? **
జవాబు: వందనం !
**2. తినగలిగే నగ? **
జవాబు: శెనగ!
**3. అమెరికాలో సైనికులు కవాతు వేటితో చేస్తారు? **
జవాబు: కాళ్ళతో!
**4. గేటు తెరిచి వున్నా వెంగళప్ప పార్కులోకి ఎందుకు వెళ్ళటం లేదు? **
జవాబు: బయట 'నో పార్కింగ్' అని ఓ బోర్డు వుందిగా?!
**5. ధనవంతుడు ఏం సంపాదించాలి? **
జవాబు: సంతృప్తి!
**6. వెంగళప్ప కారుని ఎక్కడ పార్క్ చేస్తాడు? **
జవాబు: పార్కులో !
8. పొరిగింటి పుల్లకూర రుచి- ఒక ఉదాహరణ ఇవ్వండి!
జవాబు: తెలుగు మేస్టారు తమ కొడుకుని ఇంగ్లీషు కాన్వెంట్ లో చదివించటం!
