**1. టెన్నిస్ ఆటగాడు క్రికెట్ ఆడితే ఏం చేస్తాడు? **
జవాబు: బాల్ కోసం పరుగెత్తకుండా జేబులో నుంచి బంతి తీసి వికెట్ల మీద విసురుతాడు
2. వేపపువ్వు లేకుండా ఉగాది పచ్చడి ఎక్కడ చెయ్యచ్చు?
జవాబు: టి.వి. వంటల కార్యక్రమంలో.
**3.కలికాలపు భక్తురాలు స్వామిని ఏ కాలంలో ఏమని వేడుకుంటుంది? **
జవాబు: వేసవిలో - "చల్లగా చూడు స్వామీ" అని, చలికాలంలో "వెచ్చగా చూడు స్వామీ " అని
వేడుకుంటుంది.
**4. దురాశా పరుడు కొడుక్కి ఏం నేర్పిస్తాడు..? **
జవాబు: ఒకట్లు, పదులు నేర్పకుండా లక్షలు, కోట్లు నేర్పిస్తాడు
**5. డాక్టరు ఖంగు తినేదెప్పుడు? **
జవాబు: "నా గురక వల్ల నాకు నిద్రపట్టటం లేదు" అనే పేషెంట్ ఎదురైనప్పుడు.
**6. ప్రదక్షిణలు చెయ్యలేని భక్తుడి శనిదోషం ఎలా పరిహారమౌతుంది? **
జవాబు: ప్రదక్షిణ చెయ్యలేకపోతేనేమి, దక్షిణ వేస్తే చాలు- దోషం మటుమాయం!
**7. హాస్య నటుడి బ్రెయినుకు ఏమైందట? **
జవాబు: ఆయనకు "బ్రెయిన్ హ్యుమర్"వచ్చిందట, పాపం.
