-
నల్లని అడవిలో తెల్లని దారి.. ఏంటది?
-
రెండు పళ్ళాలలో ఒక గారె... (తెలంగాణలో దొరికే ప్రత్యేకమైన అడవి పండు ఇది!) ఏంటో?
-
చీకటింట్లో జడల దయ్యం! అమ్మో, ఏంటది?
-
పచ్చని చెట్టు క్రింద ఎర్రని పెళ్ళి కూతురు! ఎవరట, ఆ పిల్ల?
-
గంపెడు శనగల్లో ఒక రాయి- ఎవరమ్మా అది?
-
ఒక ఇంట్లో 50 మంది దొంగలు! ఎవరు, వాళ్ళు?
-
బట్టలు విడిచి-బావిలో దూకె! ఎవరది?
-
వంద మంది దొంగలకు ఒకడే పోలీసు! ఏమా కథ?
-
దట్టమయిన అడవిలో ఒక రకపు జంతువే! ఏంటది?
-
చూస్తే పొట్టివాడు, ఇంటికి గట్టివాడు! ఎవరు వాడు?!
-
తోకలేని పిట్ట- తొంభై ఆమడలు పోతుంది. ఏంటా పిట్ట?!
-
ఒక పెట్టెలో ఇద్దరు దొంగలు! (ఒక్కోసారి ఒక్కరే ఉంటారు, ఒక్కోసారి ముగ్గురూఉంటారు!) ఎవరు వాళ్ళు?!
-
శరీరమంతా కళ్ళుంటాయి, చేపను కాదు. పడ్డదాన్ని మటుకు వదలను.. ఎవరు నేను?
-
వెయ్యంగా వెయ్యొస్తది, తియ్యంగా తియ్యరాదు! ఏంటది?
-
తోకతో తీసుకుంటుంది, నోటితో వదులుతుంది! ఏంటది?
-
తెల్లనిపొలంలో నల్లని విత్తనాలు! ఏంటవి?
-
అడవిలోపుట్టింది- అడవిలో పెరిగింది- మాయింటి కొచ్చింది- తైతక్కలాడింది!
-
ఒక్కదానికి యాభై పళ్ళు! ఏంటది?!
-
ఒక్క గోడకు రెండు వైపులా ఇల్లులు! ఎక్కడ అవి?
-
ఊరంతా తిరుగుతాయి, మూలకు వచ్చి చేరతాయి! ఏంటవి?
-
అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే విడిపోతాయి! ఏమిటి?
-
కిటకిట తలుపులు, కిటారు తలుపులు, ఎప్పుడు తెరిచినా చప్పుడు కావు! ఏంటవి?
-
ఇల్లంతా నాకుతుంది. మూలకు చేరి కూర్చుంటుంది. ఏంటది?
ఈ పొడుపు కథలకు జవాబులు:
- పాపడ
- మొర్రిపండు గింజ
- ఉట్టి
- పండు మిరప కాయ
- చంద్రుడు
- అగ్గిపుల్లలు
- అరటిపండు
- చీపురు
- పేను
- ఉత్తరం
- తాళం
- వేరు శెనగ కాయ (పల్లీ)
- వల
- ముల్లు
- దీపం
- కాగితం, అక్షరాలు
- కవ్వం
- దువ్వెన
- ముక్కు
- చెప్పులు
- పెదవులు
- కను రెప్పలు
- చీపురు(పరక)
