-
తాజ్ మహల్ ఎక్కడ ఉంది?
జవాబు: కట్టిన చోటే! -
చలికాలంలో ఐ స్ క్రీం తింటే ఏమవుతుంది?
జవాబు: కప్పు ఖాళీ అవుతుంది. -
రెండు మామిడి పళ్ళను ముగ్గురు ఎలా పంచుకోవాలి?
జవాబు: రసం తీసి! -
గుడికి వెళ్ళినప్పుడు బొట్టుదేనికి పెట్టుకుంటారు?
జవాబు: నుదుటికి! -
బస్సులో ఎంతమంది కూర్చోవచ్చు?
జవాబు: పట్టినంత మంది! -
ఆఫ్రికా గిరిజనులు అరటిపండు ఎలా తింటారు?
జవాబు: ఒలుచుకొని -
హుసేన్ సాగర్ లో బుద్ధుడు ఒక చేతిని పైకి ఎత్తి ఉంటాడు ఎందుకు?
జవాబు: కింద నీరు పెరిగితే పైకి పోతారని చెప్పేందుకు! -
ఓ ఇంట్లో బోలెడు డబ్బు నగలున్నాయి. ఒక గజదొంగ ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు కూడాను. అయినా అతను ఆ ఇంటిని దోచుకోలేదు ఎందుకు?
జవాబు: అది తన ఇల్లే కాబట్టి! -
ఆటలు ఆడని ప్లేయర్ ఏంటి?
జవాబు: సీడీ ప్లేయర్! -
డ్రైవర్ లేని బస్ ఏది ?
జవాబు: సిలబస్! -
నాలుకపైన పెట్టుకుంటారు గానీ మింగరు- ఏమిటది?
జవాబు: తపాలా బిళ్ళ! -
పంజరంలో ఏముంటుంది?
జవాబు: ఏదిపెడితే అదే! -
తోటలో పండిన మామిడి పండ్లు కోయడానికి సరైన కాలమేది?
జవాబు: తోతమాలి లేనికాలం! -
వాస్తు శాస్త్రిని బిచ్చగాడు ఏమడిగాడు?
జవాబు: 'ఏ చెట్టు కింద కాపురం మొదలు పెట్టమంటారు?' అని! -
"పాప" భీతి అంటే...?
జవాబు: 'పాప' అంటే భయపడటం!