-
కార్పొరేట్ స్కూలు ప్రిన్సిపాలు నిజాయితీగా ఏమని చెప్తాడు ?
"మీ అబ్బాయికి చదువొస్తుందని హామీ ఇవ్వలేను గానీ, ర్యాంకు వస్తుందని మటుకు హామీ ఇస్తున్నాను" అంటాడు! -
యల్ కే జీ లో పిల్లాడిని చేర్చటానికి వచ్చిన తల్లి దండ్రులను హెడ్మాస్టరు ఏమడిగాడు?
"ఐ ఐ టీ యల్ కేజీ యా, ఆర్డినరీ యల్ కే జీ యా?” అని! -
అన్నిటికంటే పెద్ద సీలింగ్ ఫ్యాను ఎక్కడ ఉంటుంది?
హెలికాప్టరు పైన! -
వినియోగదార్ల హక్కుల సంఘం ప్రెసిడెంటు డాక్టరును ఏమడుగుతాడు?
ఆపరేషను చేసిన తర్వాత బిల్లుతో పాటు గ్యారంటీ కార్డు ఇమ్మంటాడు! -
బట్టతల వలన లాభం ఏమిటి?
తల దువ్వుకునే శ్రమ తప్పుతుంది! -
ప్రాణం లేకపోయినా 'డెడ్' అయ్యేదెవరు?
ఫోను! -
వర్షం పడుతున్నప్పుడు వెంగళప్ప ఏం చేస్తాడు?
గొడుగు వేసుకొని మొక్కలకు నీళ్ళుపోస్తాడు!
