-
కొత్తతరం పూజారి ఏమని అడ్వర్టయిజుమెంటు ఇచ్చాడు?
"ఈ గుడిలో పూజ చేయండి- ఉచిత డోర్ డెలివరీ కలదు" అని. -
లెక్కల మేస్టారు ఇష్టంగా ఎంచుకున్న ఇంటి నెంబరు ఏది?
1/2 -3/4 +5/6 x 7/8 % 9 -
ఎవరి చెంపమీద వాళ్ళు కొట్టుకునేది ఎప్పుడు?
చెంపను దోమ కుడుతున్నప్పుడు! -
తాత ముత్తాతలు సంపాదించకుండానే మనకు అందేది ఏది?
కాలం! -
మాటల మూటలు మోసేదెవరు?
ఫోను! -
ఏ దేవుడికీ చెందని దీక్ష ఏది?
నిరాహార దీక్ష! -
ప్రాణంలేకపోయినా కరిచేది ఎవరు?
చెప్పు!
