-
అత్యాశ ..?
టికెట్లు కొనకుండా లాటరీ రావాలని ఆశపడటం! -
ఇంగ్లీషులో బటర్ అంటే వెన్న. ఫ్లయ్ అంటే ఈగ. మరి బటర్ ఫ్లయ్ అంటే?
వెన్న మీద వాలే ఈగ! -
విమానాశ్రయందగ్గర బిచ్చగాడు ఏమని అడుక్కున్నాడు?
ఒక డాలర్ ధర్మం చేయండి బాబూ! -
ప్రాణంలేకపోయినా కరిచేది ఎవరు?
చెప్పు! -
డ్రైక్లీనింగ్ అంటే..?
నీళ్ళు లేకుండానే ఉత్తుత్తిగా బట్టలు ఉతకటం! -
వార్తలు వినే అలవాటున్న టీచరు, క్లాసు ముగించే ముందు ఏమంటుంది?
ముఖ్యాంశాలు మరోసారి! -
ఎండమావి అంటేఏంటి?
ఎండలో ఉన్న మామిడి చెట్టు! -
పుస్తకానికి, టీవీకీ తేడా ఏంటి?
పుస్తకం మన దగ్గరికి వస్తుంది; మనం టివి దగ్గరికి వెళ్తాం!
