**అనగనగా రాజు! **



అనగగా రాజు
పెడతాడు పెద్ద పోజు
మూరెడుమూరెడుమీసాలు
బారెడు బారెడు గడ్డాలు
గుర్రాలమీద సవారీ
పోలీస్ చూస్తే పరారీ!




**జున్ను వెన్న! **



జున్ను వెన్న తెల్లన
దున్నపోతు నల్లన
అన్న పేరు ఎర్రన్న
నా పేరు పుల్లన్న



** లేలేత మొగ్గ **



లేలేత మొగ్గ
విచ్చితే పువ్వు
కాసితే కాయ
మెక్కితే పండు
తింటే తియ్యన
నీకింతా ఇయ్యను