**పువ్వులం పువ్వులం **
**అందమైన పువ్వులం **
రంగు రంగుల పువ్వులం
హాయిని గొలిపే పువ్వులం
**ఎర్రని గులాబి నేను **
అందరు మెచ్చే పువ్వును









కొలనులోని కలువను నేను
దేవుడు మెచ్చే పువ్వును









తెల్లా తెల్లని జాజిని నేను
సువాసన ఇచ్చే పువ్వును












పుసుపు పచ్చని చామంతిని నేను
పడతుల సిగలో పువ్వును














ఎర్ర ఎర్రని మందారాన్ని నేను
**అందరికీ ఇష్టమైన పువ్వును **













మరులు పెంచే మల్లెను నేను
సువాసన వెదజల్లే పువ్వును





**పువ్వులం పువ్వులం **
అందమైన పువ్వులం
రంగు రంగు పువ్వులం
హాయిని గొలిపే పువ్వులం